బెంగళూరులో యువతి అపహరణ యత్నం దర్యాప్తులో సంచలన నిజాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని మగాడి రోడ్డులో జరిగిన 21 ఏళ్ల యువతి అపహరణ యత్నం కేసులో విచారణ కీలక మలుపు తిరిగింది. కులాంతర వివాహం చేసుకుందన్న కక్షతో రాజస్థాన్‌కు చెందిన అత్తమామల ఆదేశాల మేరకే నిందితులు ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అప్రమత్తమైన స్థానికులు కారును వెంబడించి నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రాకేష్, కరణ్, అయాన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న డ్రైవర్ సద్దాం కోసం గాలిస్తున్నారు.