ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన సీమా కుమారికి కిషన్ రెడ్డి అభినందనలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi / Asia

ఆసియా క్రీడల్లో మహిళల 10 వేల మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి చారిత్రక విజయం నమోదు చేసిన అథ్లెట్ సీమా కుమారిని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అభినందించారు. 32:50.05 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని, దేశానికి 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పతకం అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.