నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఐదు వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రకటన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Dispur
అస్సాం రాష్ట్రంలో ఆరు వివిధ విభాగాలలో ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఖాళీల భర్తీ ప్రక్రియను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. అభ్యర్థులు సన్నద్ధం కావడానికి మూడు నెలల సమయం ఉంటుందని ఆయన తెలిపారు. అస్సాం పోలీసు, అటవీ శాఖ, హోంగార్డు, అగ్నిమాపక సేవల విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.