ఇండియా గేట్ వద్ద అంకితా భండారి తల్లిదండ్రుల అరెస్ట్: తీవ్ర నిరసన
రిపోర్టర్: శివ
స్థలం: ఢిల్లీ
అంకితా భండారి హత్య కేసుకు సంబంధించి న్యాయం చేయాలని కోరుతూ ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఆమె తల్లిదండ్రులతో పాటు పలువురు విపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేతలు పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయడం మానేసి, అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై పోలీసుల తీరు అత్యంత హేయంగా ఉందని విమర్శించారు.