ఫేక్ వీడియో షేర్ చేసిన కేసులో సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై కేసు నమోదైందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ను విమర్శిస్తున్నట్లు ఉన్న మార్ఫింగ్ వీడియోను ఆయన షేర్ చేయగా, ఆ క్లిప్ పూర్తిగా అబద్ధమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఘటన దేశంలో తీవ్ర సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.