మొదటి సంతానానికి జన్మనిచ్చిన ప్రముఖ పాప్ గాయని లేడీ గాగ

రిపోర్టర్: సునీల్ స్థలం: World

ప్రముఖ అంతర్జాతీయ పాప్ గాయని లేడీ గాగ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. కాబోయే భర్త మైఖెల్ పొలాన్స్కీతో కలిసి ఆమె మొదటి సంతానాన్ని స్వాగతించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆమె, తాజాగా లాస్‌ఏంజెల్స్‌లో బిడ్డతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రత్యక్షమయ్యారు. తల్లినైపోవడం తన జీవితంలో అతిపెద్ద లక్ష్యమని, ప్రస్తుతం తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె సన్నిహితులు తెలిపారు.