ఒకే పాఠశాలలో చదువుకుంటున్న నలుగురు కవల విద్యార్థులు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అక్కపల్లిగూడా ప్రభుత్వ పాఠశాలలో అరుదైన దృశ్యం ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాఠశాలలో నలుగురు కవల పిల్లలు ఒకే చోట విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో నాణ్యమైన బోధన అందుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వీరు ఇక్కడ అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విద్యార్థుల ముఖ కవళికలు ఒకేలా ఉండటంతో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తరచూ తికమక పడుతున్నారు. పిల్లలను గుర్తించడం కాస్త కష్టంగా ఉన్నప్పటికీ, వారికి పాఠాలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు.