సన్న రకాల వరి విత్తనాల ఆన్లైన్ నమోదు గడువు ఈ నెల 17 వరకు పొడగింపు

రిపోర్టర్: Narendra kumar kinnera స్థలం: ఖమ్మం అర్బన్

ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాల ఆన్లైన్ నమోదు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు బిల్లులతో డీలర్ల వద్ద నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. సొంత విత్తనాలైతే ఏఈఓలను సంప్రదించాలన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం నుంచి అందాల్సిన బోనస్ వర్తిస్తుందని డీఏఓ స్పష్టం చేశారు.