వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆందోళన
రిపోర్టర్: మహేష్
స్థలం: వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయపడిన రోగుల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారు. పోలీసుల దాడిలో తన కడుపులో తన్నారని, చేయి విరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.