దేశద్రోహులంటూ కాంగ్రెస్ తీరుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: రంగారెడ్డి
భారత సైన్యం ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ పార్టీ నకిలీ కృత్రిమ మేధ వీడియోలను ప్రచారం చేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల రాజకీయాల కోసం దేశద్రోహానికి పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు తీర్పులు అనుకూలంగా లేకపోతే న్యాయమూర్తులపైనే బురదజల్లుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.