మండలంలో ప్రమాదవశాత్తు కట్టర్ మిషన్ తాకి యువకుడు మృతి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం తలకొండపల్లి ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వెల్జాల్ గ్రామానికి చెందిన కూరకుల రాఘవేందర్(23) ప్లంబర్ పని చేస్తుంటాడు. గణేష్ మండపం కోసం కట్టెలు కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ జారి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.