అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు సృష్టి
రిపోర్టర్: సతీష్
స్థలం: లాహోర్
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడని క్రీడా వర్గాలు వెల్లడించాయి. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న ట్రై సిరీస్లో భాగంగా బాబర్ ఈ చారిత్రక ఘనత సాధించాడు. కేవలం మూడు వందల యాభై ఐదు ఇన్నింగ్స్లలోనే పదహారు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో పాకిస్థాన్ క్రికెటర్గా నిలిచాడు. అంతేకాకుండా మూడో స్థానంలో ఎనిమిది వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్గా బాబర్ రికార్డు సృష్టించాడు.