ఉరవకొండలో భారీ వర్షానికి వాగులో కొట్టుకుపోయిన ఎద్దుల బండి

రిపోర్టర్: సతీష్ స్థలం: Uravakonda

ఉరవకొండ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు విడపనకల్ మండలం పొలికి గ్రామం వద్ద పెంచలపాడు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగును దాటే ప్రయత్నంలో రైతు శివలింగ దంపతులు ప్రయాణిస్తున్న ఎద్దుల బండి ఒక్కసారిగా వరద ప్రవాహంలో పడిపోయింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆ దంపతులను సురక్షితంగా రక్షించారు.