అగ్నివీరులకు భారీ ఊరట: డిసెంబర్ నాటికి తొలి విడత రిటైర్మెంట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

అగ్నిపథ్ పథకం కింద సేవలు అందించిన తొలి విడత అగ్నివీరుల పదవీకాలం ముగియనుందని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి నాటికి దాదాపు పద్దెనిమిది వేల మందికి పైగా అగ్నివీరులు సర్వీస్ నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. నవంబర్ మధ్య నుంచి త్రివిధ దళాలు వీరిని విడతలవారీగా విడుదల చేయనున్నాయని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన రిజర్వేషన్లు కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.