సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

రిపోర్టర్: హరి స్థలం: Amaravati

ఏపీలో సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా ప్రమోషన్లు కల్పిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. శానిటేషన్, ప్లానింగ్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్-1గా అప్గ్రేడ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.