అమెరికాపై ప్రతీకార దాడికి కొత్త ఆయుధాలు సిద్ధం చేస్తున్న ఇరాన్

రిపోర్టర్: విజయ్ స్థలం: World

అమెరికాతో ఉద్రిక్తతలు మరింత పెరిగితే సరికొత్త ఆయుధాలు, విభిన్న సైనిక వ్యూహాలతో పాటు ఇప్పటివరకు ఎన్నడూ దాడి చేయని ప్రాంతాలపై విరుచుకుపడతామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి హొస్సేన్ మొహెబ్బీ సోమవారం హెచ్చరించారు. దీర్ఘకాలిక యుద్ధానికి ఇరాన్ పూర్తిగా సిద్ధమైందని, శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు రక్షణ రంగంలో కీలక మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.