భద్రాచలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌వీ విద్యార్థుల నిరసన సెగ

రిపోర్టర్: కృష్ణ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలం అంబేద్కర్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు మండిపడ్డారు. జీవో 97 రద్దు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని, సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్‌వీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.