బొబ్బిలి పురపాలక ఎన్నికల్లో ఓటుకు నోటు పంపిణీపై మువ్వల శ్రీనివాసరావు ఆగ్రహం

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ఎన్నికల్లో ఓటుకు నోటు పంపిణీ తీవ్ర కలకలం రేపింది. ఒక ప్రధాన పార్టీ చైర్మన్ అభ్యర్థి పొదుపు మహిళలకు డబ్బు పంపిణీ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి మువ్వల పద్మావతి ఆరోపించారు. తమకు పంపిన రెండు వేల రూపాయలను స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలో వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ డబ్బుతో ప్రజలను కొనుగోలు చేసి గెలిస్తే పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని వారు ప్రశ్నించారు.