నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17: విజయవంతంగా ఈఓఎస్-05 ప్రయోగం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. 2,367 కేజీల బరువున్న ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దక్షిణాసియాను ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫొటో తీయగల సామర్థ్యం దీని సొంతం. దేశ రక్షణ, విపత్తు నిర్వహణలో ఈ ఉపగ్రహం గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన కెమెరాతో ఇది సరిహద్దులపై నిరంతరం నిఘా ఉంచనుంది.