హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం మూడు సంవత్సరాల బాలుడు మృతి

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్స్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు సంవత్సరాల ఎనిమిది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యూజన్ ఫుడ్ హబ్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఎస్‌యూవీ కారు బాలుడిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.