తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఏపీలో దెబ్బతిన్న రెండువందల పాఠశలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్ లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఇటీవల ముంచెత్తిన తుఫాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల అరై నాలుగు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. సహాయక చర్యల కోసం ఏడు వందల తొంభై ఐదు బడులను తాత్కాలిక కేంద్రాలుగా మార్చారు.