'రూ.3.14 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ': బాపట్ల పోలీసుల కీలక విజయం

రిపోర్టర్: హరి స్థలం: Bapatla

బాపట్ల జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున రికవరీ చేసిన పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. సుమారు రూ.3.14 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను టెక్నాలజీ సహాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు మరియు వివరాలు సరిచూసి వాటిని అసలైన యజమానులకు అప్పగించడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.