అమెరికా హెచ్ వన్ బి వీసా నిబంధనలపై ఆందోళన

రిపోర్టర్: సురేష్ స్థలం: అమెరికా

అమెరికాలో హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో ఇటీవల సంచలన ప్రకటన చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని, రాబోయే రోజుల్లో వీసా నిబంధనలు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.