నందవరంలో వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిన నాయకులు

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. నందవరం మండలం గురుజాల గ్రామానికి చెందిన పలువురు నాయకులు సుమారు యాభై మంది అనుచరులతో కలిసి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలన సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే తాము పార్టీలో చేరామని కొత్త కార్యకర్తలు స్పష్టం చేశారు.