సినిమా రంగానికి బిగ్ షాక్: ఐదు వందల చిత్రాల డేటా లీక్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

సినీ పరిశ్రమకు భారీ షాక్ తగిలిందని, ఐదు వందల సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు ఆన్లైన్లో లీక్ కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోందని సీబీఎఫ్సీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ భద్రతా లోపంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, ఎవరి ఖాతాలు హ్యాక్ కాలేదని అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ ఆర్కైవ్ ద్వారా డౌన్లోడ్కు అందుబాటులోకి వచ్చిన రహస్య సమాచారాన్ని వెంటనే తొలగించి సైబర్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.