ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Bengaluru
ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే కృత్రిమ మేధస్సు శిక్షణ అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధికారులను ఆదేశించారు. వంద రోజుల ప్రణాళికలు, ప్రాధాన్యత పథకాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనువైన భూమిని గుర్తించాలని కూడా స్పష్టం చేశారు.