ఆయేషా బీఈడీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆయేషా బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తభస్సుం నాజ్ మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ అభివృద్ధికి మంచి విద్యతో పాటు విలువలను అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.