బంగ్లాదేశ్‌లో చైనా తయారీ ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
రిపోర్టర్: హరి
స్థలం: World
బంగ్లాదేశ్‌లోని హఠాజరిలో జరిగిన లైవ్ ఫైర్ డ్రిల్ సమయంలో చైనా తయారీ టైప్ 59 ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చైనా సైనిక పరికరాల నాణ్యతపై ఈ ఘటన మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.