మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ: స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపు

రిపోర్టర్: నరేష్ స్థలం: కొత్తగూడెం

మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్.గీతారాణి వెంకటరమణ పిలుపునిచ్చారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో రుద్రంపూర్ లోని సీఈఆర్ క్లబ్ లో ఉచిత టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్ మరియు బ్యూటీషియన్ కోర్సుల్ లో మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.