పశ్చిమగోదావరి జిల్లా సమీక్షా మండలి సమావేశం: భీమవరంలో కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహణ

రిపోర్టర్: హరి స్థలం: పశ్చిమ గోదావరి

భీమవరంలోని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిందని జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే అయిన నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ కీలక సమావేశంలో జిల్లాలోని తాజా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటుగా వివిధ శాఖల ప్రగతిపై కూలంకషంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.