మాయా జామ భారీ విరాళం: సొంత డబ్బులతో చారిటీకి ఆర్థిక సాయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: London
ది సెలబ్రిటీ ట్రేటర్స్ రియాలిటీ షో ఫైనల్ లో ఓడిపోయినప్పటికీ ప్రెజెంటర్ మాయా జామ తన పెద్ద మనసును చాటుకున్నారు. గెలుచుకోవాల్సిన మొత్తానికి సమానమైన ఎనభై మూడు వేల ఐదు వందల పౌండ్లను తన సొంత జేబు నుండి విరాళంగా ఇచ్చి అక్షరాలా ఆశ్చర్యపరిచారని ఆర్గనైజేషన్ డైరెక్టర్ కేథరిన్ వుడ్స్ తెలిపారు. చిన్నారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న యాక్షన్ ఫర్ చిల్డ్రన్ సంస్థకు ఈ భారీ నిధులను అందజేసినట్లు ఆమె వెల్లడించారు.