ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ భూ అక్రమాలు: పొంగులేటి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ భూ అక్రమాలకు పాల్పడిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం సొంత ఆస్తుల మాదిరిగా భూములను దోచుకున్నారని ఆరోపించారు. ధరణి లోపాల వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.