విశాఖలో డీఆర్‌డీవో మ్యాన్‌ పోర్టబుల్ అండర్‌ వాటర్‌ వెహికల్ ప్రయోగం విజయవంతం

రిపోర్టర్: రమేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని నేషనల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ల్యాబొరెటరీ ఆధ్వర్యంలో డీఆర్‌డీవో రూపొందించిన మ్యాన్‌-పోర్టబుల్‌ అటానమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్ ప్రయోగం విజయవంతమైంది. సముద్ర జలాల్లో శత్రుదేశాల క్షిపణులు, మందుపాతరలను శబ్ద తరంగాల సాంకేతికతతో ఎలాంటి మానవ సాయం లేకుండా గుర్తించే ఈ ఎంపీ-ఏయూవీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి పనితీరును నిర్ధారించారు.