సర్పంచ్ల చెక్ పవర్ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో సర్పంచ్లకు త్వరలోనే కొత్త శుభవార్త అందనుంది. గ్రామాల అభివృద్ధి నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాలకే చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉప సర్పంచ్ల చెక్ పవర్ ఇబ్బందులను తొలగించేందుకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నిధుల విడుదలలో పారదర్శకత పెరుగుతుందని, గ్రామాల్లో ఆగిపోయిన అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.