సినిమాలో ట్విస్ట్ కనిపెట్టండి: కోటి రూపాయలు గెలుచుకోండి అంటూ కిల్లర్ దర్శకుడు సవాల్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

కిల్లర్ చిత్ర దర్శక, నిర్మాత పూర్వాజ్ మీడియాతో మాట్లాడుతూ తమ సినిమా సెకండాఫ్ ట్విస్ట్ కనిపెట్టిన వారికి కోటి రూపాయల బహుమతి అందిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల ముప్పైవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి హైకోర్టు లాయర్తో ఒప్పందం చేసుకుని మరీ ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఈ వినూత్న సవాల్ విసిరినట్లు తెలిపారు.