ఎన్నికల్లో కేవలం మూడు ఓట్లతో ఘోరంగా బోల్తాపడ్డ మాజీ ఉపసర్పంచ్
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వెజ్ఞులపల్లి సెగ్మెంట్ MPTCఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ కేవలం మూడు ఓట్లు మాత్రమే సాధించి ఘోర పరాజయం పాలయ్యారు. గతంలో ఉపసర్పంచ్ గా పనిచేసిన ఆయనకు కుటుంబ సభ్యుల ఓట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఈ సంచలన ఫలితం వెలువడడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.