ఆమనగల్లులో ప్రమాదకర బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ అధికారులతో కలిసి ప్రమాదకర బ్లాక్ స్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారు. రహదారులపై ఉన్న అడ్డంకులను తొలగించి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు మరియు వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.