ఎన్టీఆర్ జిల్లాలో ప్యూర్ పవర్ నూతన షోరూమ్ ప్రారంభం
రిపోర్టర్: వెంకట్
స్థలం: జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డి.ఎన్. బ్యాటరీ అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ భాగస్వామ్యంతో ప్యూర్ పవర్ నూతన షోరూమ్‌ను ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా గృహాలు, వ్యాపార సంస్థలు మరియు వ్యవసాయ క్షేత్రాలకు ఆధునిక విద్యుత్ బ్యాకప్ పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఎదుర్కొనే వినియోగదారులకు నాణ్యమైన ప్రత్యామ్నాయాన్ని అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.