క్రీడల్లో సత్తా చాటుతున్న విజయనగరం కానిస్టేబుల్ మధుబాల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం పోలీసు శిక్షణా కళాశాల కానిస్టేబుల్ వై.మధుబాల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్రీడల్లో రాణిస్తున్నారు. చిన్నతనం నుంచే ఆటలపై మక్కువతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. ఖోఖో, కబడ్డీతో పాటు యోగ, బాక్సింగ్, బాస్కెట్బాల్లోనూ నైపుణ్యం ప్రదర్శిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.