విజయనగరం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరం ఫూల్ బాగ్ జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితా తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకు, కుటుంబ వివాదాలు, సివిల్ కేసులను ఇందులో పరిష్కరించుకోవచ్చని సూచించారు. మరోవైపు, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పిలుపునిచ్చారు.