తెలంగాణ ఉద్యమ యోధుడికి అశ్రునయనాలతో ఘనంగా నివాళులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మందమర్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సహచరుడు జె. రవీందర్ సంతాప సభను అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తెలంగాణ, కార్మిక ఉద్యమాల్లో రవీందర్ చేసిన పోరాటాలను, అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చిన్నయ్య, కోనప్పలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.