ప్రకృతితో మమేకమైన అభివృద్ధికే భవిష్యత్తు అంటూ చంద్రబాబు పిలుపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: బెంగళూరు
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంక్రీట్ జంగిల్స్ నుంచి పర్యావరణ హిత నిర్మాణాల వైపు అడుగులు వేయాలని, గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు ప్రయాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వనరులను తెలివిగా వినియోగించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.