పాలకొల్లులో దివ్యాంగులకు కోటీ పది లక్షల విలువైన సహాయ ఉపకరణాల పంపిణీ

రిపోర్టర్: సునీల్ స్థలం: పశ్చిమ గోదావరి

మానవతా దృక్పథంతో దివ్యాంగులకు కోటీ పది లక్షల రూపాయల వ్యయంతో ఉచితంగా ఐదు వందల ముప్పై సహాయ ఉపకరణాలను అందజేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు మంది దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేయనున్న ఈ సహాయ ఉపకరణాలను ఆయన స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.