కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇథనాల్ తయారీకి చెరుకు వాడకంపై నిషేధం
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్ నినో భయాందోళనల వేళ ఇథనాల్ తయారీకి చెరుకు రసం, షుగర్ సిరప్, బీ-హెవీ మొలాసిస్ వాడకాన్ని తాత్కాలికంగా నిషేధించినట్లు వెల్లడించారు. వచ్చే నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న సరఫరా సంవత్సరానికి సంబంధించి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని, దీనివల్ల దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు అదుపులోకి వస్తాయని స్పష్టం చేశారు.