తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి పదవి కోల్పోయిన సుమలతా దేవి

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతా దేవి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. రఘు మాస్టర్ వర్గం తనపై దాడి చేసిందని ఆమె ఆరోపించగా, మినిట్స్ బుక్ వివాదంపై ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన ఫిల్మ్ ఫెడరేషన్, సుమలత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆమెకు మెజారిటీ మద్దతు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ ప్రకటించగా, అక్టోబర్ 11న అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు.