మీర్జాపూర్ సినిమాలో బబ్లూ పండిట్ పాత్ర మార్పుపై దర్శకుడు క్లారిటీ

రిపోర్టర్: నరేష్ స్థలం: India

సంచలన వెబ్ సిరీస్ మీర్జాపూర్ సినిమా వెర్షన్‌లో బబ్లూ పండిట్ పాత్రను విక్రాంత్ మాస్సే స్థానంలో జితేంద్ర కుమార్‌తో రీప్లేస్ చేయడంపై దర్శకుడు గురు్‌మీత్ సింగ్ స్పందించారు. సినిమాను కొత్త కోణంలో తెరకెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొదటి సీజన్‌లో బబ్లూకు వ్యక్తిగత అజెండా లేదని, సినిమా వెర్షన్‌లో పాత్రకు మరిన్ని ఆశయాలు, సొంత ప్రణాళికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.