కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతల నిరసన

రిపోర్టర్: రమేష్ స్థలం: Telangana

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విద్యుత్ విధానాలపై గులాబీ దళం కదం తొక్కింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యుదుత్పత్తి యూనిట్లను ఆ పార్టీ బృందాలు సందర్శించాయి. ఎస్టీపీపీ, వైటీపీఎస్‌, కేటీపీఎస్‌, బీటీపీఎస్‌, కేటీపీపీ కేంద్రాల్లో పర్యటించిన నేతలు కరెంట్ కోతలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ అందజేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.