గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో రేపు బుధవారం జరుగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.