జన్నారం అడవుల్లో వన్యప్రాణుల దాహం తీరుస్తున్న నీటి కుంటలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో నీటి కోసం వన్యప్రాణులు అల్లాడే రోజులకు చెక్ పడుతోంది. ఎండాకాలం రాకముందే వాటి దాహం తీర్చేందుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన నీటి కుంటలు ఇప్పుడు వరుణుడి కరుణతో నిండుకుండల్లా మారాయి. దీంతో అడవిలోనే నీరు అందుబాటులోకి రావడంతో వన్యప్రాణులకు ఉపశమనం లభిస్తోంది. సింగరాయిపేట అడవుల్లో ఏర్పాటు చేసిన ఈ నీటి కుంటలు వన్యప్రాణుల దాహం తీర్చడమే కాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి అడవుల్లో భూగర్భ జలాల సంరక్షణకు దోహదపడుతున్నాయి.