ఈసీ నిర్ణయాలపై దుమారం: జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో ఏకపక్ష నిర్ణయాలతో ఓట్లను తొలగిస్తూ ఎన్డీఏకు ప్రయోజనం చేకూరుస్తున్నారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని కాక్రోచ్ జనతాపార్టీ నేతలు పేర్కొన్నారు. సర్వే వెరిఫికేషన్, కొత్త ఓటర్ల నమోదులో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈసీ వివాదాస్పద నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిందని, ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు రావాలని వారు స్పష్టం చేశారు.